రూమర్స్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన నాని “దసరా” డైరెక్టర్!

Published on Jun 30, 2022 12:10 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం దసరా. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో నాని లుక్ కి మాస్ ప్రేక్షకుల నుండి ప్రశంశల వచ్చాయి. అయితే ఈ చిత్రం షూటింగ్ పై వస్తున్న పుకార్ల విషయం లో డైరెక్టర్ శ్రీకాంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఈ సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని గత కొన్ని వారాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అన్ని పుకార్లను కొట్టివేస్తూ, బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా ఆగిపోయిందని ట్వీట్ చేసిన అభిమానికి దర్శకుడు గట్టిగానే సమాధానం ఇచ్చాడు. సుధాకర్ చెరుకూరి దసరాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నాని తన కెరీర్‌లో తొలిసారిగా తెలంగాణ ఆధారిత లోకల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :