శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’. అమెరికాలో, ‘హిట్ 3’ ఇప్పటికే $1.8 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు $2 మిలియన్ల మైలురాయి వైపు దూసుకువెళ్తుంది. నాని కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన ఘనత. విదేశాలలో నాని చిత్రాల్లో అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా ‘హిట్ 3’ నిలిచింది. మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఊపుతో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఎలాగూ ఈ రోజు ఆదివారం, కాబట్టి కలెక్షన్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.