నాని ‘జెర్సీ’ ఈ రోజు పూజ.. రేపు షూటింగ్ !

Published on Oct 17, 2018 11:38 am IST

‘మళ్ళీ రావా’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని ‘జెర్సీ’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ రూపొందనుంది. ఈ చిత్రంలో నాని సరసన కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ నటించనుంది.

కాగా, ఈ జెర్సీ చిత్రం ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ చిత్రం ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలోని నటీనటులు నాని, శ్రద్దా శ్రీనాద్, సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు నటిస్తోన్నారు. సాంకేతిక విభాగానికి వస్తే.. మ్యూజిక్:అనిరుద్, కెమెరామాన్ :సాను వర్గీస్, ఎడిటర్ :నవీన్ నూలి, ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి, కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి.

సంబంధిత సమాచారం :