నాని “వి” సెకండ్ షెడ్యూల్ ఫిక్సయ్యిందిగా…!

Published on Jun 12, 2019 11:14 am IST

నాచురల్ స్టార్ నాని విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘వి’. నాని ని హీరోగా తెలుగు తెరకు “అష్టా చెమ్మా” తో పరిచయం చేసిన ఈ దర్శకుడు ఆ తరువాత “జెంటిల్ మెన్” మూవీ తో నానికి మరో హిట్ అందించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వీరి మూవీ ‘వి’ సెకండ్ షెడ్యూల్ నేటి నుండి మొదలుకానుంది. ఈ విషయాన్ని ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్న హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ఈ మూవీలో నటిస్తున్నందుకు ఏంతో ఎక్సయిట్మెంట్ ఫీలవుతున్నానన్న సుధీర్, దర్శకుడు మోహన కృష్ణ ని పొగడ్తలతో ముంచెత్తాడు. గతంలో వీరిద్దరూ “సమ్మోహం” అనే మూవీ చేయడం జరిగింది. నానికి జంటగా నివేదా థామస్,అదితిరావ్ హైదరి నటిస్తున్న ఈ మూవీని మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా,అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More