దీపావళి తర్వాతే ‘నాన్నకు ప్రేమతో’ స్పెయిన్ వెళ్ళేది.!

దీపావళి తర్వాతే ‘నాన్నకు ప్రేమతో’ స్పెయిన్ వెళ్ళేది.!

Published on Nov 3, 2015 10:58 PM IST

Nannaku-Prematho
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్ మరియు డిఫరెంట్ పాత్రలో నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. షూట్ మొదలలెట్టాకా ఆగకుండా 80 రోజుల పాటు లండన్ లో షూట్ చేసిన ఈ చిత్ర టీం ఆ తర్వాత షార్ట్ గాప్ తెసుకుందాం అని ఈ ఛిత్ర టీం హైదరాబాద్ కి వచ్చింది. కానీ ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ కోసం పలు డేట్స్ అనుకున్నప్పటికీ వాటిని మార్చుకుంటూ వస్తోంది. దసరా కానుకగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసిన ఈ చిత్ర టీం నవంబర్ 1 నుంచి నెల రోజుల పాటు స్పెయిన్ షెడ్యూల్ ఉంటుందని తెలిపారు.

కానీ నవ్మబ్ర్ 1 నుంచి స్పెయిన్ షెడ్యూల్ మొదలుకాలేదు , అలాగే ప్రస్తుతం ఈ చిత్ర టీం హైదరబాద్ లోనే ఓ షెడ్యూల్ ని ఫినిష్ చేసే పనిలో ఉంది. స్పెయిన్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందా అని మేము ఈ చిత్ర టీం ని అడిగితే నవంబర్ సెకండ్ వీక్ చివరి నుంచి అనగా దీపావళి తర్వాత ఈ చిత్ర టీం స్పెయిన్ కి బయలుదేరనున్నారు. దాదాపు అక్కడ నెలరోజుల పాటు షూటింగ్ చేసి సినిమా మొత్తాన్ని ఫినిష్ చేస్తారు. డిసెంబర్ చివర్లో దేవేశ్రీ ప్రసాద్ ఆడియో ఆల్బంని రిలీజ్ చేసి జనవరి 8న సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు