మెలోడియస్ గా నిఖిల్ ’18 పేజెస్’ నుండి ‘నన్నయ రాసిన’ సాంగ్

మెలోడియస్ గా నిఖిల్ ’18 పేజెస్’ నుండి ‘నన్నయ రాసిన’ సాంగ్

Published on Nov 22, 2022 5:16 PM IST

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ హీరోగా అందాల నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ 18 పేజెస్. ఇటీవల కార్తికేయ 2 మూవీ భారీ సక్సెస్ తో మంచి జోరుమీదున్న నిఖిల్ ఈ మూవీతో కూడా మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అలానే పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి ఆసక్తిని ఏర్పరిచాయి.

ఇక ఈ మూవీ నుండి నేడు నన్నయ రాసిన అనే పల్లవితో సాగే మెలోడియస్ లిరికల్ సాంగ్ వీడియోని యూనిట్ విడుదల చేసింది. గోపి సుందర్ అందించిన సూపర్ ట్యూన్ కి శ్రీమణి రాసిన లిరిక్స్ యువతని ఇట్టే ఆకట్టుకుంటాయని చెప్పాలి. పృథ్వి చంద్ర, సితార కృష్ణకుమార్ ల వాయిస్ ఈ సాంగ్ ని ఆడియన్స్ కి ఎంతో చేరువ చేస్తోంది. గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై బన్నీ వాసు నిర్మాతగా రూపొందుతోన్న 18 పేజెస్ మూవీ రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీగా తెరెక్కుతోంది. కాగా ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తుండగా దీనిని డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు