సక్సెస్ కోసం 1971 కాలంలోకి !

Published on Jan 1, 2019 1:02 pm IST


బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ 1971 కాలంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నటించబోతున్నారట. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చిందట.

ఒక దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతో చెైతన్య దంతులూరి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ… ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నాడట.

సంబంధిత సమాచారం :

X
More