నారా రోహిత్ నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Nov 2, 2017 1:52 pm IST

నారా రోహిత్ లేటెస్ట్ సినియా ‘బాలకృష్ణుడు’. పవన్‌ మల్లెల తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో రెజీనా హీరొయిన్ గా నటిస్తోంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌-కర్నూలు చుట్టూ సాగే ఫ్యాక్షన్‌ ప్రేమకథా చిత్రంగా దర్శకుడు ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24 న విడుదల చెయ్యబోతునట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

నారా రోహిత్‌ ఇటీవల ‘శమంతకమణి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా తరువాత నారా రోహిత్ నటించిన సినిమా ఇదే అవ్వడం విశేషం. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్ర బాబు, వంశి, వినోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో నారా రోహిత్ మంచి విజయం సాదించాలని కోరుకుందాం.

 
Like us on Facebook