మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నారా రోహిత్

మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నారా రోహిత్

Published on Oct 23, 2015 11:49 AM IST

nara-rohit

నారా ఫ్యామిలీ నుంచి తెరకు చలన చిత్ర రంగంలో అడుగుపెట్టి, వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో నారా రోహిత్. ఈ ఏడాది ‘అసుర’ సినిమాతో హిట్ అందుకున్న నారారోహిత్ వరుసగా ఇప్పటికే బోలెడన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో కుమార్ నాగేంద్రతో చేసిన ‘తుంటరి’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసిన నారా రోహిత్ నేటి నుంచి పవన్ సాధినేనితో చేస్తున్నన్న ‘సావిత్రి’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. ఇది కాకుండా ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘పండగల వచ్చాడు’, ‘జో అచ్యుతానంద’ మరియు ‘వీరుడు’ అనే సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

ఇవన్నీ సరిపోవు అన్నట్టు నారా రోహిత్ తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా కూడా ఓ కొత్త డైరెక్టర్ ని పరిచయం చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం శ్రీవాస్ దగ్గర అసోషియేట్ ఆ పనిచేసిన ప్రదీప్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని సి కొర్రపాటి నిర్మించనున్నాడు. ఇప్పటికే సాయి కొర్రపాటి నారా రోహిత్ హీరోగా జో అచ్యుతానంద సినిమాని లాంచ్ చేసారు. వచ్చే ఏడాది మొదట్లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఆ సినిమా పూర్తయ్యాక ప్రదీప్ సినిమా ఉంటుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు