నార రోహిత్ ‘రౌడీ ఫెలో’ ఆడియో రిలీజ్ డేట్

నార రోహిత్ ‘రౌడీ ఫెలో’ ఆడియో రిలీజ్ డేట్

Published on Sep 9, 2014 9:15 AM IST

rowday-fellow
యంగ్ హీరో నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘రౌడీ ఫెలో’. ఈ సినిమాకి సంబందించిన చివరి షెడ్యూల్ 8వ తేదీన హైదరాబాద్ లో మొదలైంది, ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 13 వరకు జరగనుంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం కూడా సెప్టెంబర్ 13న గ్రాండ్ గా చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఇటీవలే వాషింగ్టన్ షెడ్యూల్లో ఓ పాటని షూట్ చేసుకొని వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో నారా రోహిత్ – విశాక సింగ్ లపై రెండు పాటలను షూట్ చేస్తున్నారు. ఈ రెండు పాటలతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాట రీమిక్స్ చేశారు. ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను ‘రౌడీ ఫెలో’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సన్నీ సంగీతం అందించారు.

మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు