
విలక్షణ సినిమాలతో తెలుగులో తనదైన బాణీని సెట్ చేసుకున్న హీరో నారా రోహిత్, ఈ ఏడాది ‘అసుర’ అందించిన విజయంతో వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీబిజీగా మారిపోయారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘పండగల వచ్చాడు’ లాంటి సినిమాలతో పాటు ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ అందించిన కథతో తమిళంలో మంచి విజయం సాధించిన ‘మాన్ కరాటే’ సినిమా రీమేక్ కూడా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌కు గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో పాటే సినిమా టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసేసి రిలీజ్ చేశారు. నారా రోహిత్ సినిమాల స్టైల్‌కు కొంచెం కొత్తగా ఈ సినిమాకు ‘తుంటరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదే విషయాన్ని దర్శకుడు తెలియజేస్తూ మురుగదాస్ అందించిన కథతో రూపొందిన తుంటరి సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. జిల్ సినిమా ద్వారా పరిచయమైన కబీర్ సింగ్ తుంటరిలో విలన్‌గా నటిస్తోండగా, లతా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు అశోక్ బాబా, నాగార్జున్‌లు తెలియజేశారు.

