సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై యువహీరో నారా రోహిత్ నటిస్తోన్న సినిమా ‘బాలకృష్ణుడు’ నూతన దర్శకుడు పవన్ మల్లెల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బి.మహేంద్రబాబు, వంశీ, వినోద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
యాక్షన్ లవ్ స్టోరిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో ను ఈ నెల 10 న విడుదల చెయ్యబోతున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. రెజీన ఈ చిత్రంలో కథానాయిక. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో నారా రోహిత్ మంచి విజయం సాదించాలని కోరుకుందాం.
