‘సావిత్రి’కి ముహూర్తం ఫిక్స్ చేసిన నారా రోహిత్

‘సావిత్రి’కి ముహూర్తం ఫిక్స్ చేసిన నారా రోహిత్

Published on Oct 14, 2015 8:23 AM IST

nara-rohot-1

సినిమా సినిమాకి ఏదో ఒక సరికొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతని ఎర్పరుచుకుంటున్న హీరో నారా రోహిత్. ఈ ఏడాది ‘అసుర’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నారా రోహిత్ తన తదుపరి సినిమాలను శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే కుమార్ నాగేంద్ర సినిమా షూట్ ని ఫినిష్ చేసిన నారా రోహిత్ తన న్క్ష్త్ ప్రాజెక్ట్ ‘సావిత్రి’ని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసాడు. ‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ లాంటి ఓ డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్న ఈ సావిత్రి సినిమా ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంది.

నారా రోహిత్ సావిత్రి రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 23 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. నారా రోహిత్ సరసన నందిత రాజ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాని కంటిన్యూగా షూట్ చేసి 3 నెలల్లో షూటింగ్ తో పాటు మిగిలిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఓ థ్రిల్లర్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా కూడా ఉండేలా ప్లాన్ చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. పవన్ సాధినేనితో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య డైలాగ్స్ అందిస్తుంటే, శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు