నారా రోహిత్ ‘సావిత్రి’ మూహూర్తం డీటైల్స్

nara-rohit

‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ లాంటి ఓ డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ పవన్ సాధినేని. ఈ సినిమా తర్వాత పవన్ సాధినేని నారా రోహిత్ తో ‘సావిత్రి’ అనే సినిమా చెయ్యనున్నాడని ఇది వరకే తెలియజేశాం. చాలా రోజుల క్రితమే నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు దానికి కారణం నార రోహిత్ సరికొత్త మేకోవర్ కోసం ట్రై చేస్తుండడం. ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ లోనే ఉన్న ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

జూన్ 27న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. పవన్ సాధినేనితో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం మొత్తం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య డైలాగ్స్ అందిస్తుంటే, శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం పవన్ సాధినేని హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ కూడా ఫైనలైజ్ చేస్తారు.

Exit mobile version