ప్రైమ్ వీడియో లోనే డైరెక్ట్ గా వస్తున్న నారప్ప!

Published on Jul 11, 2021 7:11 pm IST

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం నారప్ప. తమిళ నాట హీరో ధనుష్ అసురన్ రూపం లో నట విశ్వరూపం చూపించాడు. అయితే ఈ చిత్రానికి రీమేక్ గా నారప్ప రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కు సంబంధించిన పోస్టర్ మరియు పాటల ద్వారా సోషల్ మీడియా లో ఈ చిత్రం పై విపరీతమైన హైప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైరెక్ట్ ఓటి టి గా విడుదల కానుంది. అందుకోసం చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. జూలై ఆఖరున ఈచిత్రం విడుదల కి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :