నారప్పతో బాగా కనెక్ట్ అయ్యాను – విక్టరీ వెంకటేశ్

Published on Jul 30, 2021 10:00 pm IST

విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఇంటెన్స్ క్రైమ్ ఎమోషనల్ డ్రామా “నారప్ప”. తమిళ సూపర్ హిట్ చిత్రం “అసురన్”కి ఈ సినిమా రీమేక్. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సందర్భంగా నేడు ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ “నారప్ప” చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేశాడు.

అయితే నా సినీ ప్రయాణంలో ఎన్నో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించానని, ఏ పాత్రలో కూడా ఇంత లీనమవ్వని నేను నారప్పతో బాగా కనెక్ట్ అయ్యాయని అన్నారు. ‘అసురన్‌’ హక్కులు తమకు ఇచ్చినందుకు దర్శకుడు వెట్రిమారన్‌, నటుడు ధనుష్‌కి థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం ఎంటైర్ చిత్ర బృందం బాగా కష్టపడిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చిందని, ఈ విషయంలో అభిమానులు బాధపడినప్పటికే ఆదరించారని అన్నారు. అయితే ఈ సారి చిత్రంతో ఖచ్చితంగా థియేటర్లలోనే వచ్చి అలరిస్తామని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా రాగా, ప్రియమణి, శ్రీకాంత్‌ అడ్డాల, కార్తీక్‌ రత్నం, రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :