పవన్ ఫ్యాన్ లిస్ట్ లో ‘నారప్ప’ కొడుకు చిన్నప్ప.!

Published on Jul 24, 2021 10:21 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే అత్యధికంగా ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా ఎక్కువ అభిమానులు ఉన్నారు అంటే అది కూడా పవన్ కళ్యాణ్ కే.. చాలా మంది యువ నటులు నుంచి డైరెక్టర్స్ వరకు కూడా పవన్ కి టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.

మరి ఈ లిస్ట్ లో మరో యంగ్ టాలెంట్ కూడా యాడ్ అయ్యాడు. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” చిత్రం ప్రైమ్ వీడియోలో వచ్చి ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. మరి ఆ సినిమాలో వెంకీ మామ తో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు కనిపించే పాత్రే తన కొడుకు చిన్నప్ప.

ఆ రోల్ లో కనిపించిన యువ నటుడు రామకృష్ణ(రాఖీ) ఒక్కసారిగా మంచి ఫేమ్ లోకి వచ్చాడు. దీనితో అలా ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా తాను కూడా పవన్ కి అభిమానిని అని పవన్ సినిమాలో నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పాడు. దీనితో నారప్ప కొడుకు చిన్నప్ప కూడా పవన్ ఫ్యాన్స్ లిస్ట్ లో పడ్డట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం :