వెంకీ పెద్దబ్బాయిని పరిచయం చేశారు చూశారా?

Published on Jul 5, 2020 11:13 am IST

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ నారప్ప. తమిళ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ జరుపుకుందని సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వెంకటేష్ మధ్య వయస్కుడైన దళిత వ్యక్తిగా డీగ్లామర్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో వెంకటేష్ పాత్రకు ఇద్దరు కొడుకులు ఉంటారు. వారిలో పెద్దవాడైన పెళ్లీడు కొచ్చిన యువకుడు పాత్రను నేడు పరిచయం చేశాడు.

ఈ మూవీలో వెంకటేష్ పెద్ద కొడుకు పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్ర కోసం కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ ని తీసుకున్నారు. నారప్ప సినిమాలో కార్తీక్ పాత్ర పేరు ముని కన్న అని తెలుస్తుంది. సైకిల్ పై వెళుతున్న కార్తీక్ గెటప్ ఆకట్టుకొనేలా ఉంది. ఇక ఈ మూవీలో వెంకటేష్ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More