రెమ్యున‌రేష‌న్ వాపస్ అంటున్న “నారప్ప”!

Published on Jul 8, 2021 10:42 pm IST


విక్టరీ వెంకటేష్ హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కోలీవుడ్ హిట్ చిత్రం అసురన్‌కి రీమేక్‌గా తెలుగులో నిర్మించిన చిత్రం “నారప్ప”. ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే తొలుత ఈ సినిమాను థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ఫిక్స‌యిన సంగ‌తి తెలిసిందే.

అయితే చాలా సినిమాలు ఓటీటీల బాట పడుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో నిర్మాత సురేశ్ బాబు నార‌ప్పను ఓటీటీలో విడుద‌ల చేయాల‌న్న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు స‌ద‌రు ఓటీటీ ప్లాట్‌ఫాం కూడా సురేశ్ బాబు నిర్ణ‌యం ప‌ట్ల సానుకూలంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్న క‌లైపులి ఎస్ థాను మాత్రం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నాడని, థియేట‌ర్ విడుద‌ల‌కు సిద్దంగా లేన‌ట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో థియేట‌ర్ విడుద‌ల వ‌ల్ల సినిమాకు న‌ష్టాలు కనుక వ‌స్తే త‌న రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇచ్చేస్తాన‌ని చెప్పి ఎస్ థానును ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో విక్టరీ వెంక‌టేశ్ ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నారప్ప ఖన్‌ఫాంగా థియేటర్లలోనే వచ్చేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :