గ్రాండ్ గా “నరసింహాపురం” ప్రీ రిలీజ్ వేడుక…30 న థియేటర్ల లోకి!

గ్రాండ్ గా “నరసింహాపురం” ప్రీ రిలీజ్ వేడుక…30 న థియేటర్ల లోకి!

Published on Jul 27, 2021 12:00 PM IST

Narasimhapuram
పలు సీరియల్స్, సినిమాల ద్వారా నందకిషోర్ అందరికీ పరిచయం ఉన్నవారే. అయితే గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి. ఆర్. క్రియేషన్స్ సమర్పణ లో టి. ఫనిరాజ్ గౌడ్ మరియు నంద కిషోర్ లతో కలిసి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వం లో తెరకెక్కిన చట్టం నరసింహాపురం. ఈ చిత్రం తో నందకిషోర్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలని పూర్తి చేసుకొని జులై 30 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది.

సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా, నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుక లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటుడు సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఊర్వశి ఓటిటి సీఈఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ట్రైలర్ ను విడుదల చేసిన అనంతరం చిత్ర బృందానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. అయితే నరసింహ పురం చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు దర్శక నిర్మాతలు.ఎంచుట్టం అధ్బుతంగా రూపొందడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం కి ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు