సాయితేజ్ ప్రమాదంపై మరోసారి స్పందిస్తూ నరేశ్ ఏమన్నాడంటే?

Published on Sep 12, 2021 1:42 am IST


టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మరోసారి స్పందించారు. సాయి తేజ్ ప్రమాదంపై నిన్న ఉదయం తొలిసారి స్పందిస్తూ నరేశ్ మాట్లాడిన విధానంపై విమర్శలు రావడంతో మరోసారి దీనిపై స్పందిస్తూ వివరణ ఇచ్చుకున్నారు. నేను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదు.. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కూడా కాదని అన్నారు. నేను ఈ రోజు ఉదయమే సాయితేజ్ కోసం ప్రార్ధించానని, చాలా ఫాస్ట్‌గా రికవరీ అవుతున్నాడని, త్వరలో సాధారణ స్థితికి వస్తాడని నరేశ్ అన్నాడు. నా కుమారుడు నవీన్‌ విజయ కృష్ణ, సాయితేజ్ ఇద్దరు మంచి మిత్రులు అని, మా ఇంటి నుంచే నిన్న ఇద్దరు కలిసి బైక్ మీద నుంచి వెళ్లారని నేను చెప్పిన మాట వాస్తవమేనని అన్నారు.

అయితే ఇద్దరు కలిసి ఓ చాయ్ షాప్ ఓపెనింగ్ చేశారని ఆ తర్వాత ఎవరి బైక్‌పై వారు వెళుతున్న సమయంలోనే సాయితేజ్‌కు ఈ ప్రమాదం జరిగిందని, రోడ్డుపై ఉన్న మట్టి కారణంగానే బైక్ స్కిడ్ అయ్యిందని, కేవలం ఇది ప్రమాదం మాత్రమే కానీ నిర్లక్ష్యం అయితే కాదని నరేశ్ అన్నాడు. సాయితేజ్‌ క్షేమంగా బయటపడినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయన తర్వగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు మరోసారి తెలిపారు.

సంబంధిత సమాచారం :