అక్షయ్ కుమార్ క్రేజీ సినిమాలో సత్యదేవ్ కీ రోల్

Published on May 27, 2021 10:31 pm IST

అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుమ్రత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న హిందీ సినిమా ‘రామ్‌ సేతు’. ఇందులో అక్షయ్ కుమార్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. భారీ వ్యయంతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. సముద్రంలో ఉందని అంటున్న రామసేతు నిజంగా ఉందా లేదా అనేదే ఈ సినిమా కథాంశం. అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాల్లో ఇదే క్రేజీ ప్రాజెక్ట్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమాను పలు దక్షిణాది భాషల్లో కూడ రిలీజ్ చేయనున్నారు. అందుకే పలు ఇండస్ట్రీలకు చెందిన
ముఖ్య నటులను సినిమాలోకి తీసుకుంటున్నారు. తమిళం నుండి సీనియర్ నటుడు నాజర్ ఈ సినిమాలో నటిస్తుండగా తెలుగు నుండి యువ నటుడు సత్యదేవ్ ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇంత పెద్ద సినిమాలో భాగస్వామ్యం కావడం సత్యదేవ్ కు దొరికిన మంచి అవకాశమని అనొచ్చు. చిత్రం గనుక మంచి విజయాన్ని అందుకుంటే బాలీవుడ్లో సత్యదేవ్ అవకాశాలు పొందొచ్చు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు అక్షయ్ కుమార్.

సంబంధిత సమాచారం :