మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం !

మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం !

Published on Oct 4, 2018 9:08 AM IST

జాతీయ అవార్డు గ్రహీతగా, విలక్షణ నటుడుగా అన్ని భాషల్లోనూ ఎంతో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న బహుభాషా నటుడు నాజర్‌. తమిళ్, తెలుగు సినిమాల్లో ఇప్పటికి ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సీనియర్ నటుడు ఆయన. ఇప్పుడు నాజర్ వారసుడు తమిళంలో హీరోగా పరిచయం అవ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద కుమారుడు కూడా సినిమాల్లోనే ఉన్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాజర్ చిన్న కుమారుడు అబీ మెహిదీ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన మొదటి సినిమాని తమిళంలో చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్ స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయిందని తెలుస్తోంది. నవంబర్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు