తేజ సజ్జ కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన నాని.!

Published on Jul 1, 2021 9:45 pm IST


“జాంబీ రెడ్డి” మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో అండ్ టాలెంటెడ్ హీరో తేజ‌స‌జ్జ‌, హ్యాపెనింగ్ బ్యూటీ శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజ‌న‌ల్స్ బ్యాన‌ర్లు పై చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల నిర్మాత‌గా మ‌ల్లిక్ రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రం అద్భుతం. ఆ, జాంబిరెడ్డి, క‌ల్కి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాకు క‌థ అందించ‌డం విశేషం.

జాంబిరెడ్డి సినిమాతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టకున్న యంగ్ హీరో తేజ‌స‌జ్జ ఈ సినిమాతో మ‌రో వైవిధ్య‌మైన రోల్ తో ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్నారు. యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖ‌ర్, స‌హ‌జ న‌టి జీవిత రాజశేఖ‌ర్ త‌న‌య శివాని రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. శివాని రాజశేఖ‌ర్ ఇప్ప‌టికే ప‌లు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

మరి ఈరోజు జూలై 1న శివాని రాజశేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అద్భుతం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నాచుర‌ల్ స్టార్ నాని ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాలు ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అద్భుతం అనే టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే ఈ ఫ‌స్ట్ లుక్ ని వినూత్నంగా సిద్ధం చేశారు ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్, అప్ అండ్ డౌన్ ప‌ద్ధ‌తిలో ఈ ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేయ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో మంచి టాక్ తో అంద‌కుంటూ ట్రెండ్ అవుతుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ స్టోరీ, మ‌ల్లిక్ రామ్ డైరెక్ష‌న్ స్కిల్స్, తేజ స‌జ్జ యాక్ష‌న్, శివాని రాజ‌శేఖ‌ర్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్యూటీ వెర‌సి అద్భుతం చిత్రం ప్రేక్ష‌కుల్ని అత్యద్భుతంగా ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అని నిర్మాత చంద్ర‌శేఖ‌ర్ వ్య‌క్తం చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చంద్ర‌శేఖ‌ర్ క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :