ఇంటర్వ్యూ : నవదీప్ – ఇకపై నాకు నచ్చిన పాత్రలే చేస్తాను

Published on Mar 4, 2021 10:20 pm IST

 

జెఫ్రీ గీ చిన్ మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి నటించిన చిత్రం ‘మోసగాళ్ళు’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్రలో నటించిన నవదీప్ మీడియాతో కొన్ని విశేషాలను షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

 

‘మోసగాళ్ళు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఇందులో నా పాత్ర ఒక వైట్ కాలర్ క్రిమినల్ పాత్ర. హీరో పాత్రను ఎంకరేజ్ చేసి ఫస్ట్ స్కామ్ చేయించే పాత్ర. కథకు మూల కారణమైన పాత్ర ఇది. బాగుంటుంది.

 

స్క్రిప్ట్ విన్నాకే సినిమాకు ఓకే చేశారా ?

విష్ణు ఇలా పాన్ ఇండియా సినిమా అనగానే చాలా ఆసక్తి కలిగింది. సెటప్ పెద్దదిగా ఉంటుందని అనిపించింది. నిజమైన కథతో రూపొందుతున్న సినిమా కాబట్టి కొత్తగా ఉంటుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను.

 

ఇందులో కాజల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?

ఈ సినిమాలో ఆమె పాత్ర బలంగా ఉంటుంది. నా పాత్రకు, కాజల్ పాత్రకు అస్సలు పడదు. ఎత్తుకు పైఎత్తు వేసి నన్ను ఇబ్బందిపెట్టే పాత్ర. చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది.

 

సినిమాకు ఆడియన్స్ ఎలా రిలేట్ అవుతారు ?

మామూలు చదువు ఉన్న ఒక అక్కా చెల్లెళ్ళు ఇండియాలో కూర్చుని అమెరికాలో ఉన్న వారిని ఎలా మోసం చేశారు. వాళ్ళ లూప్ హొల్స్ పట్టుకుని ఎలా మోసం చేశారు అనేది కథ. నిజమైన స్కామ్ కాబట్టి ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా కనెక్ట్ అవుతారు.

 

హాలీవుడ్ డైరెక్టర్ కదా సినిమా ఎలా జరిగింది ?

హాలీవుడ్ డైరెక్టర్ కాబట్టి ఇంగ్లీష్ వెర్షన్, తెలుగు వెర్షన్ మధ్యన తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంగ్లీష్ లో కట్ కట్ అన్నట్టు ఉంటే తెలుగులో కథ, పాత్రలు లోతుగా ఉంటాయి. తెలుగులో మేం చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఏం చేస్తున్నామో జాగ్రత్తగా గమనించేవారు. చాలా స్మార్ట్.

 

ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది మీకు ?

అంటే .. కెరీర్ మొదట్లో పలానా పాత్రలు చేస్తే బాగుంటుందని అనుకునేవాడ్ని. చందమామ సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. ఏవీ ఎక్కలేదు. ఇప్పుడేమో ఖాళీగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడని ఆఫర్లు వస్తున్నాయి. అందుకే తొందరేమీ లేదని నచ్చిన పాత్రలు వస్తేనే చేద్దామని డిసైడ్ అయ్యాను.

 

వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయా ?

రోజూ వస్తుంటాయి. కానీ వాటిలో ఏవీ కూడ నాకోసం రాసిన పాత్రాల్లా ఉండవు. అందుకే వాటిని చేయట్లేదు. నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను.

 

హీరోగా ఆఫర్లు ఏమైనా వస్తున్నాయా ?

ఒక ఫాంటసీ లవ్ స్టోరీ చేయబోతున్నాను. ఆ సినిమా డైరెక్టర్ ‘బాహుబలి’ రచయితల్లో ఒకరు. కెమెరామెన్ కూడ. మార్చి 15 నుండి మేఘాలయాలో షూట్ చేయబోతున్నాం. మొత్తం అక్కడే ఉంటుంది. ఆ సినిమా ఖచ్చితమైన ఛేంజ్ తెస్తుందని ఆశిస్తున్నాను.

 

మీ సీ స్పేస్ గురించి చెప్పండి ?

బన్నీ వచ్చి ఓపెన్ చేయగానే 6000 మంది వచ్చారు. అందరినీ ఇంటర్వ్యూ చేసి వారి నుండి కొంతమందిని సెలెక్ట్ చేశాం. మంచి కథలు సిద్ధం చేస్తున్నాం. మా దగ్గర రూపొందే కథలో అందరూ పాల్గొంటారు. మా కథ త్రివిక్రమ్ గారికి బాగా నచ్చింది. ఆహాకు కూడ రాస్తున్నాం. ఇంకొంతమంది బయటి వారికి కూడ కథలు రాస్తుంటాం. రచయితల కొరత ఉంది. డైరెక్టర్లు కూడ అదే డిసైడ్ అయ్యారు. నా ఐడియాలను కూడ వారికి చెప్పాను. అల్లు అరవింద్ గారు కూడ మెచ్చుకున్నారు.

సంబంధిత సమాచారం :