నవరస ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైన మణిరత్నం!

Published on Jul 26, 2021 1:45 pm IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న అంథాలజి చిత్రం నవరస. ఈ చిత్రం లో మణిరత్నం నవరసాలు ఉండేలా ప్లాన్ చేశారు. మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో నవరస ను తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే ఈ నవరస నుండి విడుదల అయిన వీడియోలు, పాటలు, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవరస నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ 6 వ తేదీ నుండి ప్రసారం కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు నవరస టీమ్ ప్రమోషన్స్ లో భాగం గా ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ వారాంతం వరకూ ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 9 ఎపిసొడ్ లతో తెరకెక్కిన ఈ నవరస కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :