రేపే “నవరస” టీజర్ విడుదల

Published on Jul 8, 2021 7:48 pm IST

మణిరత్నం సమర్పణ లో వస్తున్న నవరస వెబ్ సిరీస్ విడుదల కి సిద్దం అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన టీజర్ రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్,కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు. అయితే అగ్ర తారలైన సూర్య, రేవతి, సిద్ధార్ద్, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఐశ్వర్య రాజేష్ లు సైతం నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :