కరెక్ట్ స్క్రిప్ట్ దొరికితే మహేష్ తో పని చేస్తా – మణిరత్నం

Published on Jul 9, 2021 10:22 pm IST

ఎన్నో క్లాసిక్ చిత్రాలను తీసి భారతీయ సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మణిరత్నం. అయితే అలనాటి తారలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన మణిరత్నం నేటి యువ దర్శకులకు సైతం ఆయన స్పూర్తి. అయితే మణిరత్నం క్రియేటివ్ అయిన నవరస అంథాలజీ చిత్రం ఆగస్ట్ 6 న విడుదల కి సిద్దం అవుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను నేడు విడుదల చేయడం జరిగింది.

అయితే నవరస చిత్రం ప్రమోషన్స్ లో భాగం గా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా పై ఆయన మాట్లాడారు. గతం లో మహేష్ తో సినిమా కోసం చర్చలు జరిపా అని వ్యాఖ్యానించారు. అయితే స్టొరీ సరిగ్గా రాకపోవడం తో సినిమా చేయలేదు అని అన్నారు. అయితే సరైన కథ దొరికినప్పుడు తప్పక మహేష్ బాబు తో కలిసి పని చేస్తా అని అన్నారు. అయితే మణిరత్నం చేసిన వ్యాఖ్యల పై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :