బన్నీ విలన్ బీస్ట్ లుక్ లో కేకపుట్టిస్తున్నాడు.

Published on Aug 6, 2019 12:19 pm IST

అల్లుఅర్జున్ తన 19వ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కొరకు చిత్ర బృందం కొద్దిరోజుల క్రితం కాకినాడ వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో బన్నీ ఫ్యాన్స్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాగా సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్ర షూటింగ్ త్రివిక్రమ్ నిర్విరామంగా పూర్తి చేస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో సుశాంత్,టబు,నివేదా పేతురాజ్,నవదీప్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు చేయనున్నారు.

వీరిలో హీరో సుశాంత్ బన్నీకి బావ పాత్రలో కనిపిస్తుండగా, నవదీప్ విలన్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. కాగా నవదీప్ బాగా కండలు పెంచి సిద్ధం చేసిన సిక్స్ ప్యాక్ బాడీ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అట్ట్రాక్ట్ చేసే కర్వుడ్ బాడీతో పూర్తి మేక్ ఓవర్ లో ఉన్న నవదీప్ ఫోటో చాలా ఆసక్తి కలిగేలా వుంది. ఐతే ఈ మేక్ ఓవర్ బాడీ బన్నీ చిత్రం కోసమా,లేక మరేదైనా మూవీ కో రకా,లేక అందరు యంగ్ స్టార్స్ వలే ఆయన సరదాగా ట్రై చేశారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. గతంలో నవదీప్ “బాద్షా” తోపాటు కొన్ని చిత్రాలలో విలన్ గా కనిపించారు.

సంబంధిత సమాచారం :