నవాబ్ విడుదల తేదీ ఖరారు !
Published on Sep 10, 2018 6:39 pm IST

అరవింద స్వామి, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, శింబు, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మణి రత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘చెక్క చివంత వానం’. తెలుగులో ‘నవాబ్’ పేరుతో అనువాదం అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రంలో అరవింద స్వామి, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, శింబు అన్నదమ్ములుగా నటిస్తున్నారట. వీరి మధ్య వచ్చే గొడవల తాలూకు సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయి.

ఇక తాజాగా ఈ చిత్రం యొక్క విడుదలకు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 27న రెండు భాషల్లో ఒకే సారి విడుదలకానుంది ఈచిత్రం. ఇక తెలుగులో అదే రోజు నాగార్జున, నాని కలిసి నటిస్తున్న ‘దేవదాస్’ కూడా విడుదలవుతుంది. మరి బాక్సాఫిస్ వద్ద ‘దేవదాస్’ ను తట్టుకుని ఈ నవాబ్ ఎంత వరకు నిలబడుతాడో చూడాలి.

  • 9
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook