నయన్ మరోసారి నిరూపించుకుంది !
Published on Aug 17, 2018 3:50 pm IST

టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి నయనతార తమిళ భాషలో నటించిన చిత్రం ‘కొలమావు కోకిల'(కోకో) . ఈ చిత్రం ఈరోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా తెరకెక్కిన ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

డ్రగ్స్ సరపరా చేసే ముఠా చుట్టూ తిరిగే ఈసినిమాలో నయన్ నటన, అనిరుధ్ సంగీతం హైలెట్ గా నిలిచిందట. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో కామెడీ చాల వరకు వర్క్ అవుట్ అయ్యిందని అక్కడక్కడ నెమ్మదించిన కథనం ఈ సినిమాకు నెగిటివ్ గా చెప్పుకోవచ్చు అంటున్నారు తమిళ ప్రేక్షకులు. ఇక ఈ సినిమాతో నయన్ మరోసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఎంచుకొని విజయం సాధించింది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రం ‘కోకో కోకిల’ పేరుతో తెలుగులో విడుదలకావల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. త్వరలోనే ఈచిత్రాన్ని తెలుగులో విడుదలచేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook