మహేష్ సినిమాలో నయన్..క్లారిటీ ఇదే.!

Published on Jul 6, 2021 7:24 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్లతో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో కూడా ఒక క్విక్ ప్రాజెక్ట్ ను కూడా మహేష్ కమిట్ అయ్యి దానిని కూడా శరవేగంగా కంప్లీట్ చేసేయాలని ప్లాన్ లో ఉన్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ పై కొన్నాళ్ల నుంచి హీరోయిన్స్ పై పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటగా పూజా హెగ్డే పేరే మెయిన్ ఫిమేల్ లీడ్ కి వినిపించగా ఆ తర్వాత మరిన్ని పేర్లు కూడా లైన్ లోకి వచ్చాయి. అయితే లేటెస్ట్ గా మాత్రం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార పేరు రేస్ లోకి వచ్చినట్టు బజ్ నడుస్తుంది.

అయితే ఇందులో ప్రస్తుతానికి అయితే ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదట. రానున్న రోజుల్లో కూడా క్లారిటీ ఉండనట్టు తెలుస్తుంది. అయితే తన ప్రతీ సినిమా క్యాస్టింగ్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పేర్లనే త్రివిక్రమ్ తీసుకొస్తారు మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :