కాబోయేవాడితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్న స్టార్ హీరోయిన్

Published on Dec 11, 2019 9:02 am IST

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఓ స్థాయి హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతారకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది ఆమె రెండు భారీ చిత్రాలలో హీరోయిన్ గా చేశారు. వాటిలో మెగాస్టార్ చిరంజీవి చేసిన పాన్ ఇండియా మూవీ సైరా కాగా, విజయ్ హీరోగా తెలుగు తమిళ భాషలలో విడుదలైన బిగిల్ మూవీ. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడం విశేషం. ఇక వచ్చే ఏడాది సూపర్ స్టార్ రజిని తో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేస్తున్న దర్బార్ మూవీతో నయనతార మొదలుపెట్టనున్నారు. దర్బార్ మూవీలో కూడా నయనతార హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ అమ్మడు గత కొద్దిరోజులుగా తన ప్రియుడు మరియు కాబోయే వాడు విగ్నేష్ శివన్ తో ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శిస్తున్నారు.కొన్నాళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతార లు రిలేషన్ షిప్ లోఉన్న సంగతి తెలిసిందే. నిన్న కన్యాకుమారిలోని భాగవతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఈ జంట నేడు తిరుచెందూర్ మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నారని సమాచారం. నయనతార ప్రస్తుతం నేత్రికన్, మూకుతి అమ్మన్ అనే తమిళ చిత్రాలతో నటిస్తున్నారు.

nayantara visits temple along with his fiance vignesh sivan

సంబంధిత సమాచారం :

More