సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ క్యూట్ కపుల్.. నేడు తమ నాలుగో పెళ్లి రోజును చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో ఓ అదిరిపోయే ఫోటోను పంచుకున్నారు నయన్. “మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు” అంటూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ గా మారింది.
చూడముచ్చటైన ఫ్యామిలీ మూమెంట్
నయనతార షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలో విఘ్నేష్ శివన్ తన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకోగా.. నయన్ తన భర్తకు రొమాంటిక్ గా ముద్దు పెడుతూ కనిపించారు. డెనిమ్ ఔట్ ఫిట్స్ లో ఈ ఫ్యామిలీ అంతా చాలా స్టైలిష్ గా ఉన్నారు. కొడుకుతో కలిసి ఈ జంట ఎంజాయ్ చేస్తున్న తీరు ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఓ బ్యూటిఫుల్ విదేశీ వీధిలో తీసినట్లుగా ఉన్న ఈ క్యాండిడ్ మూమెంట్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
ఈ పిక్ చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. “మీది చాలా అందమైన కుటుంబం.. ఎవరి దిష్టి తగలకూడదు” అంటూ ప్రేమగా కామెంట్స్ పెడుతున్నారు. కాగా, 2022 జూన్ 9న చెన్నై మహాబలిపురంలో నయనతార, విఘ్నేష్ ల వివాహం చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఏది ఏమైనా, వర్క్ తో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంలో ఈ జంట ఎప్పుడూ ముందే ఉంటారు అనడానికి ఈ క్యూట్ ఫోటోనే నిదర్శనం.


