షూటింగ్ పూర్తి చేసి గిఫ్ట్స్ ఇచ్చిన నయనతార !

Published on Feb 9, 2019 5:04 pm IST

కోలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తీ అవ్వగానే ఆచిత్ర హీరో , హీరోయిన్లు సినిమా కి పని చేసిన యూనిట్ కు కాస్టలీ బహుమతులు ఇవ్వడం ఈ మధ్య సర్వ సాధారణం ఆయిపోయింది. అందులో భాగంగా కీర్తి సురేష్ ఇటీవల పందెంకోడి 2 చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. తాజాగా ఈజాబితాలోకి లేడీ సూపర్ స్టార్ నయన తార చేరింది. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్ సరసన ‘మిస్టర్ లోకల్’ అనే సినిమాలో నటిస్తుంది. తాజాగా తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేసి సినిమా యూనిట్ కు ఫాసిల్ వాచ్ లను గిఫ్ట్ గా ఇచ్చింది.

‘ఓకే ఓకే ‘ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :