‘సైరా’ షూటింగ్లో జాయిన్ ఆయిన నయనతార !

చారిత్రిక నైపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ‘సైరా’ ప్రస్తుతం హైదరాబాద్లోని నానక్ రామ్ గూడలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తికాగా ఈ రెండవ షెడ్యూల్లో చిత్ర కథానాయకిగా ఎంపికైన నయనతార జాయిన్ అయ్యారు. దీంతో చిరంజీవి, నయనతార, జగపతిబాబు వంటి ప్రముఖ నటుల కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక కథలో మరొక కీలక పాత్ర చేయాల్సిన అమితాబ్ బచ్చన్ ఈ నెల 28నుండి షూటింగ్లో పాల్గొంటారట. ఇకపోతే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మెగా అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాల్ని రేకెత్తించిన ఈ చిత్రాన్ని సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.