
నయనతార ‘నైట్ షో’ ఏంటి.? ఇకపై నయనతార కూడా నైట్ ఈవెంట్స్ లో డాన్స్ షోస్ ఇవ్వనుందా? అని అనుకుంటున్నారా.? అలా అనుకున్నారంటే మీరు పొరబాటు పడ్డట్టే.. ఎందుకంటే ‘నైట్ షో’ అనేది తన రాబోయే సినిమా పేరు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నయనతార తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది.
వరుసగా కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా మధ్యలో ‘అనామిక’ లాంటి థ్రిల్లర్ సినిమాలో కూడా నటించింది. ఇది రిలీజ్ అయిన కొద్ది రోజులకే నయనతార మరి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లో బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ డైరెక్టర్.
అశ్విన్ శరవణన్ తన కథకి నయనతార అయితే బాగుంటుందని ఆమెని సంప్రదించగా ఆమెకి కథ బాగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా సినిమా బడ్జెట్ పరంగా తన రెమ్యూనరేషన్ కూడా తంగ్గించుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని షూట్ చేయనున్నారు. మరి నయనతార ఈ థ్రిల్లర్ తో అయినా కమర్షియల్ హిట్ అందుకుంటుందేమో చూడాలి..