బాలయ్య 108 : రేపు నందమూరి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్

Published on Mar 21, 2023 10:00 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ వర్కింగ్ టైటిల్ మూవీ NBK 108. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి మూవీస్ తో కెరీర్ పరంగా వరుస సక్సెస్ లతో మంచి జోరుమీదున్న బాలకృష్ణ, ఈ మూవీతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవడం ఖాయం అంటోంది యూనిట్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా రేపు ఉదయం 10 గం. 15 ని. లకు ఒక అప్ డేట్ రానుంది. కాగా రేపు ఈ మూవీ నుండి బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారని, అందుకోసం ప్రస్తుతం స్పెషల్ గా ఫోటోషూట్ కూడా జరుగుతుందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరి మొత్తంగా అయితే రేపు ఉగాది సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం :