‘బాలయ్య’ మళ్లీ సింహా సెంటిమెంట్ తోనే ?

‘బాలయ్య’ మళ్లీ సింహా సెంటిమెంట్ తోనే ?

Published on Aug 7, 2019 7:47 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి ‘రాయల సింహా’ అని టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఇంకా ఇటివంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.

ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ బ్యాంకాక్‌ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు