భారీ ధరకు “NBK108” డిజిటల్ రైట్స్

Published on Apr 2, 2023 2:40 pm IST

నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు సక్సస ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటిసారిగా ఒక మాస్ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు, తాత్కాలికంగా NBK 108 అని పేరు పెట్టారు. ఇటీవల, నిర్మాతలు ఈ చిత్రాన్ని దసరా సీజన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల పై ఒక క్లారిటీ వచ్చింది.

ప్రముఖ ఓటిటి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను భారీ ధరకి కొనుగోలు చేయడం జరిగింది. అయితే, మేకర్స్ నుండి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది, ఇందులో శ్రీలీల కూడా కీలక పాత్ర పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకం పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :