జూలై 23 న ఆహా లో ప్రీమియర్ గా “నీడ”

Published on Jul 8, 2021 11:30 pm IST

అప్పు ఎన్. భట్టాతిరి దర్శకత్వం లో కుంచాకో బోబన్ మరియు నయనతార లు ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం నిజల్. ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దం అయింది. ఈ చిత్రం తెలుగు లో డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయ్యేందుకు సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఆహా వీడియో ద్వారా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 23 వ తేదీన ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ గా రానుంది. అయితే ఇందుకు సంబంధించిన తెలుగు పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రానికి సంగీతం సూరజ్ ఎస్ కురూప్ అందించారు.

సంబంధిత సమాచారం :