నీది నాది ఒకే కథ మోషన్ టీజర్ కు మంచి స్పందన !
Published on Dec 8, 2017 11:00 am IST

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను జనాలు ఎప్పుడూ ఆధరిస్తారు. నిర్మాతకు బ‌డ్జెట్ భారం అన్న‌ది లేకుండా .. కేవలం క‌థ‌, క‌థ‌నం మాత్ర‌మే న‌మ్ముకుని తీసిన ఎన్నో కాన్సెప్ట్స్ సినిమాలు విజయం సాదించిన సందర్భాలు మనం చూసాం. తాజాగా వస్తోన్న నీది నాది ఒకే కథ చిత్రం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న ఈ సినిమా మోషన్ టీజర్ ఈరోజు విడుదల అయ్యింది. మోషన్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో జరుపుకోన్నున్న ఈ సినిమా వాల్ పోస్టర్ సినిమా వారు ఓవర్సీస్ లో విడుదల చెయ్యనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమాకు రాజ్ తోట కెమెరా మెన్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్.

మోషన్ టీజర్ కోసం క్లిక్ చెయ్యండి:

 
Like us on Facebook