మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ!

Niiharika
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్స్‌గా వెలుగొందుతున్న వారి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే హీరోలు చాలామందే ఉన్నా మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా మాత్రం ఇప్పటివరకూ ఎవ్వరూ ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు లేవు. కాగా తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్‌ కూడా తెలుగు సినీ పరిశ్రమలో మెప్పించేందుకు సిద్ధమవ్వడం విశేషంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇప్పటికే పలు టీవీ షోల్లో వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ప్రముఖ న్యూస్ చానల్ టీవీ 9 సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుస హిట్స్‌తో పాపులర్ అయిన నాగ శౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను టీవీ 9 సంస్థతో కలిసి మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version