చెన్నైలో రికార్డు కొట్టిన స్టార్ హీరో…!

Published on Aug 9, 2019 8:07 am IST

తల అజిత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం “నెర్కొండ పార్వై” నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. హీరో అజిత్ లాయర్ గా నటించిన ఈ చిత్రం అక్కడ హిట్ టాక్ సొతం చేసుకుంది. ఆలోచింపజేసే కథనం తో పాటు అజిత్ అద్భుత నటన చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయని సమాచారం. కాగా ఈ మూవీ చెన్నై సిటీలో రికార్డు వసూళ్లు సాధించిందని సమాచారం.
ఈ చిత్రం చెన్నై నగరవ్యాప్తంగా మొదటిరోజు 1.58కోట్ల కలెక్షన్స్ తో 2019 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది.అలాగే అజిత్ కెరీర్ లోనే చెన్నై సిటీ కలెక్షన్స్ పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఐతే తమిళనాడు వ్యాప్తంగా మొదటి రోజు వసూళ్ళలో మాత్రం అజిత్ గత చిత్రం “విశ్వాసం” చిత్ర కలెక్షన్స్ కంటే తక్కువ కావడం గమనార్హం.

2016 లో అమితాబ్ ప్రధాన పాత్రలో విడుదలై బాలీవుడ్ లో హిట్ అందుకున్న “పింక్” చిత్రాన్ని అజిత్ “నెర్కొండ పార్వై” పేరుతొ రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మించడం విశేషం.

సంబంధిత సమాచారం :