విడుదలైన ‘నేను లేను’ ట్రైలర్ !

విడుదలైన ‘నేను లేను’ ట్రైలర్ !

Published on Dec 24, 2018 10:00 AM IST

nenu lenu

హ‌ర్షిత్ హీరోగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నేను లేను’.’లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫిబ్రవరి 1న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. టీజ‌ర్‌కి మంచి ఆదరణ లభించింది. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం అన్నారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు