సంపూర్ణేష్ గ్రేట్…నెటిజన్లు ప్రశంసలు!

Published on Jul 1, 2021 7:15 pm IST


ఉపాధి లేక 50 రోజుల వ్యవధిలో దుబ్బాక లో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఘటన పై ప్రతి ఒక్కరినీ కలచి వేస్తుంది. అయితే దుబ్బాక లో నరసింహ చారి కుటుంబం లో జరిగిన ఈ వార్త చూసి గుండె చలించిపోయింది అంటూ సంపూర్ణేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే తల్లి దండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు 25 వేల రూపాయలను తను, తన నిర్మాత సాయి రాజేష్ అందించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే వారి చదువుకు పూర్తి అయ్యే ఖర్చులు కూడా తామే చూసుకుంటాం అని మాట ఇచ్చారు సంపూర్ణేష్ బాబు.

అయితే సంపూర్ణేష్ చేసిన ఈ గొప్ప పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు గ్రేట్ అంటూ కొందరు అంటున్నారు. అయితే నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ, తనను నటుడు గా పరిచయం చేయడం కంటే ఇంత మంచొడిని పరిచయం చేసినందుకు గొప్ప అనుభూతి కలుగుతుంది అని అన్నారు. లవ్ యూ సంపూ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :