అక్షయ్ పై ప్రశంసలు,మిగతా వారిపై విమర్శలు.

Published on Jul 18, 2019 4:45 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో నిన్న అస్సాం వరదబాధితుల సహాయార్థం రెండు కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరదబాధితుల కొరకు
ఒక కోటి రూపాయల విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కి,అలాగే కజిరంగ్ జాతీయ పార్కులోని జంతువుల రక్షణార్థం మరో కోటి, ఇలా మొత్తం రెండు కోట్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాలలో స్పందించి సామజిక బాధ్యత నెరవేరుస్తున్న అక్షయ్ కుమార్ రియల్ హీరో అని నెటిజెన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఐతే ఇదే సమయంలో వారు మిగతా స్టార్ హీరోలపై మండిపడుతున్నారు. అక్షయ్ కుమార్ ఒక్కడికేనా సామజిక బాధ్యత ఉంది,కోట్ల రూపాయలు సంపాదన ఉన్న మిగతా స్టార్ హీరోల పరిస్థితి ఏమిటని వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారుకూడా ఈ పరిస్థితి పై స్పందించి వరద బాధితుల సహాయం కొరకు ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :