డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం గా ఉన్న నయనతార “నెట్రికన్”

Published on Aug 12, 2021 5:03 pm IST

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తూ మిలింద రావు దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం నెట్రికన్. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది. డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఆగస్ట్ 13 వ తేదీన ఈ చిత్రం ఏక కాలంలో తమిళం తో పాటుగా తెలుగు లో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం కోసం నయనతార అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ చిత్రం లో నయనతార బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :