సుశాంత్ మరణంపై ఇది ఇంకా ఎందుకు బయటకు రాలేదు?

Published on Oct 31, 2020 10:00 am IST

బాలీవడ్ కు చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం మొత్తం దేశ వ్యాప్తంగా ఎంతటి విషాదాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ నుంచి ఎన్నో రకాల ట్విస్టులు అలాగే మలుపులు తిరిగిన ఈ కేసు ఎటు కాకుండా పోయిన పరిస్థితి లోకి వెళ్ళిపోయింది.

సుశాంత్ అభిమానులు మరియు సానుభూతిపరులు పెద్ద ఎత్తున డిమాండ్ చెయ్యడంతో సిబిఐ కు ఆ కేసును అప్పగించారు. కానీ వారు కూడా సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ కేసు మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం మొదలయ్యింది. కానీ ఇటీవలే మళ్ళీ సుశాంత్ మరణానికి న్యాయం దొరికి తీరాలని నెటిజన్లు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.

అలా ఇప్పుడు అతడి మరణంపై ఎంతో కీలకమైన సిబిఐ ఎందుకు ఎలాంటి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు అని ప్రశ్నిస్తూ మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా సెక్షన్ 302 ప్రకారం కేసును తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు సుశాంత్ మరణంపై మిస్టరీగా నిలిచిన ప్రశ్నలకు సమాధానం కావాలని అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More