ప్రభాస్ “ఆదిపురుష్” పై నెవర్ బిఫోర్ గాసిప్..!

Published on Feb 1, 2022 12:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయిన చిత్రాలు రెండు ఉన్నాయి. మరి వాటిలో దర్శకుడు రాధా కృష్ణ తో చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమా రాధే శ్యామ్ ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక దీని తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన భారీ సినిమా “ఆదిపురుష్” కూడా ఉంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాపై గత కొన్నాళ్ల నుంచి క్రేజీ ఇన్ఫో లు వినిపిస్తూ వస్తున్నాయి.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంకో నెవర్ బిఫోర్ గాసిప్ వైరల్ అవుతుంది. ఈ సినిమాని మేకర్స్ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తారని టాక్ ఉండగా.. మరి ఈ రిలీజ్ ని ఒక ప్రముఖ హాలీవుడ్ బ్యానర్ తో టై అప్ అయ్యి రిలీజ్ చేస్తారన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదే కానీ నిజం అయ్యితే ఇలా రిలీజ్ అవ్వబోతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా ఆదిపురుష్ నిలుస్తుందని చెప్పాలి. మరి చూడాలి దీనిపై ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :